ASR: జీకేవీధి మండలం జర్రెల పీహెచ్సీని బుధవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పసుపులేటి నారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కేన్సర్ నివారణకు 14నుంచి 15ఏళ్ల లోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్లను అందించాలన్నారు. ఈమేరకు, బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.