AP: విశాఖలోని మౌనిక హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రవీంద్రతో పాటు గదిలో అతని స్నేహితుడు ఉండేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత రవీంద్ర తన స్నేహితుడికే ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. హత్య చేసింది ఒక్కరా, ఇద్దరా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రవీంద్ర మొబైల్ డేటా ఆధారంగా అతని స్నేహితుల పాత్రపై ఆరా తీస్తున్నారు.