GDWL: అలంపూర్ శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవార్లను గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో దీప్తి, అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఆలయ పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు.