SRD: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. పటాన్చెరులో అధికారులతో సమీక్షలో మాట్లాడిన ఆయన, అర్హులందరికీ పారదర్శకంగా ఇళ్లు అందిస్తామని తెలిపారు. సర్వే కొనసాగుతోందని, డబ్బులు అడిగే వారిని నమ్మొద్దని సూచించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.