NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మినగల్లు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.