ADB: క్రీడలతోనే శారీరక ఆరోగ్యం కలుగుతుందని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామ యువకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 3న గ్రామంలో నిర్వహించనున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలకు హాజరుకావాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, నాయకులు భూషణ్, నవీన్ తదితరులు ఉన్నారు.