TPT: తుడాలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ విచారణ మొదలు పెట్టింది. 18 అంశాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ తుడా అధికారులకు లేఖలు పంపింది. సిమెంట్ బెంచీల తయారీ, వాహనాలు, ప్రయాణాల ఖర్చులు, చంద్రగిరి నియోజకవర్గ ఎంపీడీవోల ఖాతాలకు నిధుల మళ్లింపు తదితర అంశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది.