PLD: నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించారు. ‘కార్యకర్తలే పార్టీకి బలమని, అందరి సహకారంతో నరసరావుపేటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.