NLG: కొండమల్లేపల్లిలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గత నెల 30న స్థానిక బైక్ రిపేర్ షాపులో అల్యూమినియం వస్తువులను అపహరించిన జంగాల కాలనీకి చెందిన వీరిని బుధవారం తనిఖీల్లో పట్టుకున్నట్లు సీఐ నవీన్ కుమార్, ఎస్సై రమేష్ తెలిపారు. నిందితులు పారిపోతుండగా వెంబడించి పట్టుకోగా నేరం అంగీకరించినట్లు వెల్లడించారు.