AP: వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని రకాల మెడిసిన్స్ విక్రయించడం నేరం. అయినప్పటికీ మెడికల్ షాప్ నిర్వాహకులు మందుల అక్రమ విక్రయాలను ఆపట్లేదు. తాజాగా ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో అబార్షన్ మందులు వాడి ఓ యువతి మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై DMHO శోభ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై డ్రగ్ కంట్రోల్ అధికారుల నుంచి నివేదిక కోరారు.