CTR: పుంగనూరు కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా నేడు గరుడసేవ నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై ప్రత్యేకంగా అలంకరించి.. పురవీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.