BDK: జిల్లాలో డా.బాబూ జగ్జీవన్ రావ్119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డా.బాబూ జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.