GNTR: తెనాలి నియోజకవర్గంలోని గుడివాడలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. సీసీ రోడ్లు, బీసీ-ఎస్సీ కమ్యూనిటీ హాల్స్‌ను ప్రారంభించారు. గ్రామ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన వెల్లడించారు.