NLG: ఎమ్మెల్యే వీరేశం ఉదయం 8:45 గంటలకు చిట్యాల మండలం ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, గ్రామసభలో పాల్గొంటారు. అనంతరం చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో జరిగే ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సమావేశాలకు హాజరవుతారు. పర్యటనలో భాగంగా గోరెంకలపల్లి, చీమలగడ్డల్లోనూ కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభిస్తారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.