MDK: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ తార్యా నాయక్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బానొత్ రాములు అనే వ్యక్తి మూడు రోజుల క్రితం కల్లు తాగి ద్విచక్ర వాహనంపై వస్తు అదుపుతప్పి బోల్తాపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.