కర్నూలు: ఓర్వకల్లు మండలం కన్నమడకల సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రంగస్వామి (33) రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందారు. విధులు ముగించుకుని బైక్‌పై కర్నూలుకు వెళ్తుండగా ఎయిర్‌పోర్టు సమీపంలో కారు ఢీకొట్టింది. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.