AP: రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. ‘తొలిదశ 50 వేల ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకే రూ.లక్ష కోట్లు కావాలి. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు అంటే ఇంకో రూ.లక్ష కోట్లు అవసరం. ఈ మొత్తం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని నిలదీశారు. బాహుబలి సెట్టింగ్స్‌తో గీసిన మాస్టర్ ప్లాన్‌ను ఎందుకు మార్చేశారంటూ దుయ్యబట్టారు.