TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్దేవ్పల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. రూ.100 కోట్ల విలువైన 188 ఎకరాల క్రీడా మైదానం స్థలాన్ని కాపాడింది. శాస్త్రిపురంలోని హుడా లేఅవుట్ స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. క్రీడా మైదానానికి కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది. కాగా గతంలో GHMC పలుమార్లు నోటీసులు ఇచ్చింది.