MNCL: తాండూర్ మండలం ఆచ్చలాపూర్కి చెందిన దుద్దిళ్ల శ్రీహర్ష శర్మ ఈటీవీ నిర్వహిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. పాడుతా తీయగా సీజన్-26లో జిల్లాకు చెందిన శ్రీహర్ష ద్వితీయ స్థానంలో నిలవడం జిల్లాకు గర్వకారణమని ఆచ్చలాపూర్ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు.