W.G: ఎంపీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో 29 ఏళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించిన వర్ధమాన గజలక్ష్మి ఉద్యోగ విరమణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. పాఠశాల సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శామ్యూల్ జాన్, కాంప్లెక్స్ చైర్మన్ రవిశంకర్ సర్దార్, ప్రధానోపాధ్యాయుని జి. నాన్సీ, వైస్ ప్రెసిడెంట్ బోనం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.