MBNR: ప్రభుత్వం కార్మికుల హక్కులను కాపాడాలని బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు షేక్ బాబుమియా అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం రైల్వే స్టేషన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్2లను రద్దు చేయాలన్నారు. కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తుందన్నారు.