MBNR: మిడ్జిల్ మండలంలోని 24 గ్రామపంచాయతీలలో రేపు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గీతాంజలి బుధవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీల వద్ద ఈ సభలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామఅభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై చర్చ ఉంటుందన్నారు.