కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సీఐ శ్రీధర్ గౌడ్, ఎస్సై రంజిత్‌లు తెలిపారు. హిల్చిపూర్ శివారులో బుధవారం సమాచారం రాగా తొమ్మిది మంది నుంచి ఒక కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ యాభై వేలు ఉంటుందన్నారు.