VKB: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని జిల్లా విద్యాధికారి(DEO) రేణుకా దేవి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం ఆమె MEO రాంచందర్తో కలిసి మరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిబంధనల ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.