AP: అమరావతికి చట్టబద్ధత లభించడంపై హోంమంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నిరంతర కృషి, పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల తరపున సీఎంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.