TPT: పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం MRO కార్యాలయాన్ని తనిఖీ చేసి మ్యుటేషన్, రీ-సర్వే, PGRS, IVRS తదితర సేవల పురోగతిని సమీక్షించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు మెరుగ్గా అందించాలని సూచించిన ఆయన, విధుల్లో నిర్లక్ష్యం ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.