NTR: ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 40,065 మందికి రూ.17.30 కోట్ల పింఛన్ సొమ్మును ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం(M) మూలపాడులో ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను ఎమ్మెల్యే, కూటమి నేతలు బుధవారం లబ్ధిదారులకు అందజేశారు.