AP: మంత్రి నారా లోకేష్ ఇవాళ రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. అయితే, బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపనున్నారు.