AKP: యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలవల్ల గడ్డి మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి 108 వాహనంలో అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పట్టణ ఎస్సై సావిత్రి తెలిపారు. ఆ వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.