AP: సీఎం చంద్రబాబు కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోందడ రామస్వామి కళ్యాణానికి చంద్రబాబు దంపతులు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వారు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో స్వామి వారి కళ్యాణానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.