W.G: లంక గ్రామం అయోధ్యలంకలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం వినూత్నంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. “మేము గోదావరి దాటి వచ్చాము.. మీ పిల్లలను పాఠశాలకు పంపి భవిష్యత్తుకు పునాది వేయండి” అంటూ తల్లిదండ్రులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ బడుల్లోని వసతులను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.