TG: ఏపీ రాజధాని అమరావతి ఏర్పాటుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్ సభలో కేంద్రప్రభుత్వం బిల్లు ఆమోదించడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణకు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.