KMM: ఏప్రిల్ 3న ఉదయం 10 గంటలకు ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి పుష్పమాలంకరణ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పేర్కొన్నారు.