NGKL: సలేశ్వరం లింగమయ్య జాతర బందోబస్తు విధులకు వెళ్తూ హోంగార్డు బయన్న ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ చెందినవాడు. అచ్చంపేట సమీపంలో ఆయన పురుగు మందు తాగి మృతి చెందారు. విధి నిర్వహణకు వెళ్తూ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో సహచర సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.