MLG: ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వాయిదాపై రాష్ట్ర మంత్రి సీతక్క స్పందించారు. మల్లంపల్లి సభలో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ కారణంగానే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆలస్యం జరిగిందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో సరిహద్దులు మారే అవకాశం ఉందని తెలిపారు. లేకపోతే ఇప్పటికే డివిజన్ కార్యాలయం ఏర్పాటయ్యేదని ఆమె స్పష్టం చేశారు.