MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 500 ఎకరాల మొక్కజొన్న కోతకు రాగా, 20 శాతం కోతలు పూర్తయినట్లు రైతులు తెలిపారు. కానీ కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.