MBNR: జిల్లా కేంద్రంలో వ్యభిచార ముఠా గుట్టును టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. అశోక్ టాకీస్ చౌరస్తాలోని శ్రీ సాయి బాలాజీ టవర్స్, ఫ్లాట్ నంబర్ 309లో సాగుతున్న ఈ వ్యవహారంపై బుధవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.