CTR: పలమనేర్ మున్సిపల్ పరిధిలోని గంటాఊరు వైయస్సార్ నగర్లో ఉన్న శ్రీ కనుమ గంగమ్మ ఆలయం జాతరకు విచ్చేయాలని MLA అమర్నాథ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయనను కలసి సన్మానించి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 4న చాటింపు, 13న శిరస్సు మెరవణి, 14న విశ్వరూప దర్శనం, 15న జలధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.