ATP: అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించడం చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండ మండలం లత్తవరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఒక్క ఓటు రాష్ట్రానికి వేల కోట్ల నిధులు, అభివృద్ధిని తెచ్చిందని వివరించారు.