NGKL: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా బుధవారం ఎంపీ మల్లురవి మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.