KDP: వేంపల్లిలో బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్ర మాట్లాడుతూ.. మామిడి రైతులకు 50 శాతం సబ్సిడీతో ఫ్రూట్ కవర్లు అందిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పథకాన్ని వినియోగించుకొని పంటను రక్షించుకోవాలని సూచించారు. అనంతరం శాఖల వారీగా ప్రగతిని సమీక్షించారు.