MNCL: గ్రామాలలో సమస్యల పరిష్కారంపై నూతన సర్పంచులు దృష్టి పెట్టాలని లక్షెట్టిపేట మండల ప్రత్యేక అధికారి అవినాష్, ఎంపీడీవో సరోజ సూచించారు. బుధవారం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని నూతన సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించనున్న ప్రత్యేక గ్రామసభ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.