KDP: వేంపల్లెలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. ఇవాళ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అర్చకుల నేతృత్వంలో అభిషేకం, నివేదన, మహా మంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అయ్యప్ప స్వామి వారు ఉత్తరా నక్షత్రం రోజు జన్మించారని తెలిపారు.