SRD: నారాయణఖేడ్ శివారులోని శ్రీ భక్త మార్కండేయ చంద్రమౌళీశ్వర ఆలయంలో ఈనెల 23న ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు హనుమంతరావుపేట గ్రామంలోని సర్పంచ్, గ్రామస్తులకు కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. అదేవిధంగా ఖేడ్‌లో కరణ్ గజేంద్ర భారతి మహారాజ్‌ను కూడా ఆహ్వానించి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.