SRPT: హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో మణికంఠ పూజ స్టోర్స్ నిర్వాహకుడు అయ్యప్ప స్వామి భక్తుడు అర్వపల్లి నాగేందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి జన్మదిన వేడుకల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.