ప్రకాశం: టంగుటూరి పొగాకు వేలం కేంద్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 22 గ్రామాలను 12 కస్టర్లుగా విభజించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో తొలి దశ కొనుగోలు జరుగుతుండగా, రెండవ దశలో ఈ ప్రాంతంలో ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.