E.G: కొవ్వూరులో సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విగ్రహానికి ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, బీసీ సోదరులు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. సర్దార్ పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు అని అన్నారు.