SRCL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గురువారం ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై చర్చించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్ విద్యార్థులకు అల్పాహార పథకంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించారు.