ASR: జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బదిలీ అయిన విషయం తెలిసిందే. జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్న కలెక్టర్కు గురువారం పాడేరులో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా అధికారులు, సిబ్బంది పాడేరులోని అంబేద్కర్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.