ASF: గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్ట విరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ జిల్లా SP నితికా పంత్ గురువారం స్పష్టం చేశారు. ఈ మేరకు PCPNDT యాక్ట్ -1994 ను జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 50,000 జరిమానా ఉంటుందన్నారు.